New Delhi: న్యూఢిల్లీ సమీపంలో నడి రోడ్డుపై ల్యాండ్ అయిన విమానం!

  • 2వ నంబర్ జాతీయ రహదారిపై ఘటన
  • విమానంలో సాంకేతిక లోపం గమనించిన పైలెట్
  • సురక్షితంగా ల్యాండింగ్

అత్యవసర పరిస్థితుల్లో దేశంలోని జాతీయ రహదార్లు విమానాల ల్యాండింగ్ కు అనుకూలమని మరోసారి రుజువైంది. న్యూఢిల్లీకి సమీపంలోని ఘజియాబాద్ రెండో నంబర్ జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది. ఎన్సీసీకి చెందిన రెండు సీట్ల విమానం బరేలీ నుంచి హిండన్ ఎయిర్ బేస్ కు బయలుదేరగా, అరగంట తరువాత విమానంలో సాంకేతిక లోపం తలెత్తినట్టు పైలెట్ గుర్తించారు. వెంటనే విషయాన్ని అధికారులకు తెలుపగా, వారు పోలీసుల సహకారంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ ను నిలిపారు. వారి సూచన మేరకు నేషనల్ హైవేపై విమానం సురక్షితంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. పైలెట్లు క్షేమంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విమానం రెక్క మాత్రం దెబ్బతింది.

New Delhi
Ghagiyabad
Flight
Emergency Landing
  • Loading...

More Telugu News