Trisha: నాకు పెళ్లంటూ జరిగితే...: త్రిష ఆసక్తికర వ్యాఖ్యలు!

  • పెళ్లిపై నమ్మకం లేదు
  • జరిగితే మాత్రం వెగాస్ లోనే
  • సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ కు జవాబులు 

ఇటీవల తన అభిమానులతో సోషల్ మీడియా వేదికగా మాట్లాడిన హీరోయిన్ త్రిష, తనకు ఎదురైన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెప్పింది. తనకు కూడా కొన్ని కలలు ఉన్నాయని పేర్కొంది. వివాహ వ్యవస్థపై తనకు నమ్మకం లేదని సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇదే సమయంలో తనకు నచ్చిన మగాడు దొరికి, పెళ్లంటూ చేసుకుంటే వెగాస్ లోనే చేసుకుంటానని, అదే తన డ్రీమ్ లిస్ట్ లో ఉన్న క్రేజీ డ్రీమ్ అని వెల్లడించింది. ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'పొన్నియిన్‌ సెల్వన్‌', మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం, మోహన్‌ లాల్‌ తో 'రామ్‌' సినిమాలతో బిజీగా ఉన్న త్రిష, మరిన్ని సినిమాలను ఫైనలైజ్ చేసే పనిలో ఉంది.

Trisha
Marriage
Social Media
  • Loading...

More Telugu News