Amaravati: తెరపైకి ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం.. మైసూరా‌రెడ్డి ఇంట్లో సీమ నేతల సమావేశం

  • సమావేశానికి హాజరైన పలువురు సీమ నేతలు
  • మూడు రాజధానులను వ్యతిరేకించిన నేతలు
  • త్వరలో భవిష్యత్ కార్యాచరణ

ఆంధ్రప్రదేశ్ రాజధానిని అమరావతి నుంచి విశాఖపట్టణానికి తరలించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రాయలసీమ నేతలు ప్రత్యేక రాష్ట్రం డిమాండ్‌ను తెరపైకి తీసుకొచ్చారు. ఈ మేరకు మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నేత అయిన ఎంవీ మైసూరారెడ్డి నివాసంలో నిన్న పలువురు నేతలు సమావేశమయ్యారు. కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి,  మాజీ ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి సహా పలువురు రాయలసీమ నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు.

ఏపీకి మూడు రాజధానులను ముక్తకంఠంతో వ్యతిరేకించారు. పాలన వికేంద్రీకరణ బిల్లుకు శాసనమండలి బ్రేక్ వేయడంతో, ప్రభుత్వం కనుక ఆర్డినెన్స్ తీసుకొస్తే ఏం చేయాలనేదానిపై చర్చించారు. అలాగే,  నెల్లూరు, ప్రకాశం జిల్లాలతో కూడిన ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఇందుకు సంబంధించి త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు.

Amaravati
Andhra Pradesh
Rayalaseema
mysura Reddy
  • Loading...

More Telugu News