Akkineni Nagarjuna: మా బ్యానర్ పై ‘83’ చిత్రం విడుదల కానుండటం సంతోషం: అక్కినేని నాగార్జున

  • 1983 క్రికెట్ వరల్డ్ కప్ ను భారత్ దక్కించుకోవడం మరవలేం
  • ఆ క్షణాలు తలచుకుంటే ఇప్పటికీ రోమాలు నిక్కబొడుస్తాయి
  • ఓ ట్వీట్  చేసిన నాగార్జున

1983 క్రికెట్ వరల్డ్ కప్ ను భారత జట్టు కైవసం చేసుకున్న క్షణాలను అభిమానులే కాదు యావత్తు దేశం మర్చిపోని మధుర సంఘటన. దీని ఆధారంగా రూపొందిస్తున్న బహుభాషా చిత్రం ‘83’. రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్ సంస్థతో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై ’83‘ను తెలుగులో విడుదల చేయనున్నారు.

ఈ సందర్భంగా నాగార్జున అక్కినేని స్పందిస్తూ ఓ ట్వీట్ చేశారు. 1983లో భారత్ తొలిసారిగా ప్రపంచకప్ ను కైవసం చేసుకున్న క్షణాలను తలచుకుంటే రోమాలు నిక్కబొడుచుకుంటాయని అన్నారు. తెలుగు వర్షన్ ‘83’ను తమ బ్యానర్ లో విడుదల చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. కాగా, ఏప్రిల్ 10వ తేదీన ‘83’ సినిమాను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.

Akkineni Nagarjuna
’83’
movie
Reliance
Annapurna studios
1983
world cup cricket
  • Error fetching data: Network response was not ok

More Telugu News