Jagan: తుగ్లక్ చేసిన మంచి కార్యక్రమాలు కూడా జగన్ చేయడం లేదు!: యనమల సెటైర్లు

  • సెలెక్ట్ కమిటీకి సిఫారసుపై సీఎంకు అభ్యంతరం ఏంటీ?
  • బిల్లులను మేము ‘రిజక్ట్’ చేయలేదు
  • ‘రిజక్ట్’ చేశామన్న అభిప్రాయంలో వాళ్లు ఉన్నారు

రెండు బిల్లులను సెలెక్ట్ కమిటీకి సిఫారసు చేయడంపై ఉన్న అభ్యంతరం ఏంటో సీఎం జగన్ చెప్పాలి, ఏంటి తప్పు? అని టీడీపీ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. బిల్లులను తామేమీ ‘రిజక్ట్’ చేయలేదని, వాటిని ‘రిజక్ట్’ చేశామన్న అభిప్రాయంలో వారు ఉన్నారని, వారి ఆలోచనా విధానం ఆ విధంగా ఉందని దుయ్యబట్టారు. ఏదో ఒక రకంగా బిల్లులు పాస్ చేసుకుని, ఇక్కడి నుంచి వైజాగ్ పోయి, వాళ్లు అనుకున్నట్టు చేయాలని చూస్తున్నారంటూ సీఎం జగన్ పై ఆయన మండిపడ్డారు.

‘అసలు అమరావతి అంటే ఎందుకు ఎలర్జీ?' అంటూ జగన్ ని ప్రశ్నించారు. ‘క్యాపిటల్’ అనే మాట రాజ్యాంగంలో లేదన్న జగన్ వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. ఢిల్లీని ఏమంటున్నాం? అని ప్రశ్నించారు. ప్రపంచంలో గానీ, భారతదేశంలో గానీ ఒకసారి రాజధాని ఏర్పాటు చేసిన తర్వాత ఒక్క తుగ్లక్ తప్ప ఎవరైనా మార్చిన దాఖలాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. చరిత్రలో తుగ్లక్ చేసిన మంచి కార్యక్రమాలు కూడా జగన్ చేయడం లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Jagan
cm
Yanamala
Telugudesam
Amaravati
  • Loading...

More Telugu News