Ratan Tata: హీరో పర్సనాలిటీతో రతన్ టాటా ఫొటో.. సోషల్ మీడియాలో వైరల్

  • గంటలో లక్ష లైక్ లు.. వేల అభినందనలు
  • ఆకట్టుకుంటున్న యువకుడిగా ఉన్న టాటా ఫొటో 
  • మూడు నెలల కింద ఇన్ స్టాగ్రామ్ లో ఖాతా ప్రారంభం

ప్రముఖ పారిశ్రామిక వేత్త, టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా ఇటీవలే ఇన్ స్టాగ్రామ్ లో తన ఖాతాను ప్రారంభించారు. 82 ఏళ్ల టాటా.. తాను యువకుడిగా ఉన్న సమయంలో తీసిన ఫొటోను ‘త్రోబ్యాక్ థర్స్ డే పిక్చర్’ గా ( తమ పాత చిత్రాలను గురువారం నాడు పోస్ట్ చేసే ప్రక్రియ) తాజాగా పోస్ట్ చేశారు.

యువకుడిగా ఉన్నప్పుడు రతన్ టాటా బాలీవుడ్ హీరోకు తీసిపోని రీతిలో ఉన్నాడని కామెంట్లు, షేర్లు కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి. ఈ ఫొటో లాస్ ఏంజెల్స్ లో ఉన్నప్పుడు తీసిందని టాటా పేర్కొన్నారు. అమెరికాలోని జోన్స్ అండ్ ఎమ్మాన్స్ అనే సంస్థలో కొంతకాలం పనిచేసి 1962లో భారత్ కు తిరిగి వస్తోన్న సమయంలో ఈ ఫొటో తీయించుకున్నానని టాటా పేర్కొన్నారు.

మరోవైపు ఆయన ఫాలోవర్స్ కూడా రతన్ టాటా యువకుడిగా ఉన్న సమయంలో తీయించుకున్న మరో త్రోబ్యాక్ ఫొటోను పోస్ట్ చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు.

Ratan Tata
Old Photo
Instagram
posted
  • Loading...

More Telugu News