Jagan: ‘మండలి’ని కొనసాగించాలా? వద్దా? అనే అంశంపై సీరియస్ గా చర్చ జరగాలి: సీఎం జగన్

  • రాజ్యాంగంలో ‘క్యాపిటల్’ అనే పదమే లేదు
  • అభివృద్ధి కోసం వికేంద్రీకరణ చేయొచ్చు
  • రాష్ట్రంలో ఎక్కడి నుంచి అయినా పాలన సాగించవచ్చు

రాజ్యాంగంలో ‘క్యాపిటల్’ అనే పదమే లేదని, అభివృద్ధి కోసం వికేంద్రీకరణ చేయొచ్చని సీఎం జగన్ అన్నారు. ఏపీ అసెంబ్లీలో ఈరోజు ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎక్కడి నుంచి అయినా పరిపాలన సాగించవచ్చని అన్నారు. ఈ సందర్భంగా తమిళనాడుకు చెందిన దివంగత సీఎం జయలలిత గురించి ప్రస్తావించారు. ఆమె తన హయాంలో ఊటీ నుంచి పరిపాలన చేశారని గుర్తుచేశారు.

‘మండలి’ అన్నది ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇవ్వడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నది అని అన్నారు. మండలిని కొనసాగించాలా? వద్దా? అనే అంశంపై సీరియస్ గా చర్చ జరగాలని, దీనిపై అసెంబ్లీలో సోమవారం చర్చించేందుకు అనుమతి ఇవ్వాలని స్పీకర్ తమ్మినేనిని జగన్ కోరారు.

Jagan
assembly
Tammineni Sitaram
speaker
  • Loading...

More Telugu News