Galla Jayadev: ఏపీ శాసనమండలి చైర్మన్ పై ఎంపీ గల్లా జయదేవ్ ప్రశంసలు

  • మహమ్మద్ ప్రవక్త బోధనలను అనుసరించారు
  • త్రికరణ శుద్ధితో నిర్ణయం తీసుకున్నారు
  • తెలుగు ప్రజల గుండెల్లో షరీఫ్ చిరస్థాయిగా నిలిచిపోతారు

రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలన్న ఏపీ శాసన మండలి చైర్మన్ నిర్ణయంపై టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ మరోమారు హర్షం వ్యక్తం చేశారు. షరీఫ్ పై ప్రశంసల వర్షం కురిపించారు. మహమ్మద్ ప్రవక్త బోధించిన నియమాలను అనుసరించి, ఒత్తిళ్లు తట్టుకొని, త్రికరణ శుద్ధితో షరీఫ్ నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు. రైతుల హృదయాల్లో ఆవరించిన కారు చీకట్లను తొలగించారని, ‘అధర్మం’ గెలవదని నిరూపించిన షరీఫ్ తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారంటూ గల్లా తన ట్వీట్ లో పేర్కొన్నారు.

Galla Jayadev
mp
AP Legislative Council
Sharif
  • Loading...

More Telugu News