Gopichand: 'సీటీమార్'పైనే గోపీచంద్ ఆశలు

  • మళ్లీ సంపత్ నందితో గోపీచంద్ 
  •  మాస్ ను అలరించే నేపథ్యంలో సాగే కథ
  • గోపీచంద్ సరసన నాయికగా తమన్నా  

తెలుగులో మాస్ యాక్షన్ హీరోగా గోపీచంద్ కి మంచి క్రేజ్ వుంది. ఫ్యామిలీ ఆడియన్స్ ను అలరించే సినిమాలు కూడా ఆయన చేశాడు. అయితే సక్సెస్ అనేది ఆయన ఖాతాలో పడి చాలా కాలమే అయింది. కథల ఎంపికలో ఆయన ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా విజయం మాత్రం ఆయన వైపు తొంగిచూడటం లేదు. ఈ నేపథ్యంలో ఆయన సంపత్ నంది దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు.

మాస్ అంశాలు ఎక్కువగా కలిగిన కథతోనే ఈ సారి ఆయన సెట్స్ పైకి వెళ్లాడు. ఈ సినిమాకి 'సీటీమార్' అనే టైటిల్ ను ఖరారు చేసుకున్నాడు. ఒక పాప్యులర్ పాట నుంచి తీసుకున్న టైటిల్ కావడంతో జనంలోకి బాగా పోయింది. ఈ సినిమాలో గోపీచంద్ సరసన నాయికగా తమన్నా కనిపించనుంది. ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ తెచ్చిపెడుతుందనే నమ్మకంతో గోపీచంద్ వున్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి.

Gopichand
Tamannah
  • Loading...

More Telugu News