Prakash Raj: బ్రహ్మానందం భావోద్వేగాలు కన్నీళ్లు పెట్టిస్తాయట!

  • ప్రధాన పాత్రలో ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ 
  • కీలకమైన పాత్రలో బ్రహ్మానందం 
  •  సంగీత దర్శకుడిగా ఇళయరాజా

తెలుగు తెరపై నాన్ స్టాప్ గా నవ్వులు పూయించిన హాస్య నటుడిగా బ్రహ్మానందం కనిపిస్తారు. ఆయన మేనరిజం .. డైలాగ్ డెలివరీ .. ఎక్స్ ప్రెషన్స్ తలచుకుని మరీ నవ్వుకునేలా ఉంటాయి. అలాంటి బ్రహ్మానందం 'రంగమార్తాండ' సినిమాలో ఒక కీలకమైన పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమాలో ఆయన కామెడీని కాకుండా బరువైన ఎమోషన్స్ ను పలికిస్తారట. సందర్భానికి తగినట్టుగా ఆయన పలికించే భావోద్వేగాలు కన్నీళ్లు పెట్టిస్తాయని అంటున్నారు.

 బ్రహ్మానందం భావోద్వేగాలు ఆవిష్కరించిన సినిమాల్లో 'బాబాయ్ హోటల్' ఒకటిగా కనిపిస్తుంది. ఆ సినిమాలో ఆయన నవ్వించడమే కాదు .. ఏడిపిస్తాడు కూడా. అదే తరహాలో 'రంగమార్తాండ' సినిమాలోను ఆయన పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉంటుందని అంటున్నారు. కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి ఇళయరాజా సంగీతాన్ని సమకూర్చగా, ప్రధాన పాత్రల్లో ప్రకాశ్ రాజ్ .. రమ్యకృష్ణ కనిపించనున్నారు.

Prakash Raj
Ramyakrishna
  • Loading...

More Telugu News