Kannababu: వైఎస్ తీసుకువచ్చిన వ్యవస్థను జగన్ రద్దు చేస్తారని ఎలా అనుకుంటున్నారు?: ఏపీ మంత్రి కన్నబాబు

  • మండలిని రద్దు చేస్తారని వార్తలు
  • సెలెక్ట్ కమిటీకి బిల్లు వెళితే ప్రభుత్వం ఓడినట్టు కాదు
  • రాజకీయ కక్షను తీర్చుకోబోమన్న కన్నబాబు

ఆంధ్రప్రదేశ్ మండలిని రద్దు చేయనున్నట్టు వచ్చిన వార్తలను మంత్రి కన్నబాబు ఖండించారు. మండలిని రద్దు చేసే యోచనలో ప్రభుత్వం ఉందని కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. ఈ ఉదయం ఓ టీవీ చానెల్ తో మాట్లాడిన ఆయన, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలన మరింత పారదర్శకంగా ఉండాలన్న ఆలోచనతో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి, మండలిని పునరుద్ధరించారని గుర్తు చేశారు.

తన తండ్రి తీసుకు వచ్చిన ఓ వ్యవస్థను, ఆయన కుమారుడు ఎలా రద్దు చేస్తారని అనుకుంటున్నారని మంత్రి ప్రశ్నించారు. మూడు రాజధానుల బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపినంత మాత్రాన ప్రభుత్వం పడిపోయినట్టు కాదని, విపక్షాలకు బలం ఉండబట్టే, అలా చేయగలిగారని, అంతమాత్రాన తామేమీ రాజకీయ కక్ష తీర్చుకోబోమని ఆయన స్పష్టం చేశారు.

Kannababu
YSR
Jagan
Council
  • Loading...

More Telugu News