Boyapati Sreenu: బోయపాటి మూవీలో ఆధ్యాత్మిక వేత్తగా బాలయ్య?

  • బాలకృష్ణ తదుపరి సినిమాకి సన్నాహాలు 
  •  ఖరారు కావలసిన కథానాయికలు 
  •  విలన్ పాత్రలో హీరో శ్రీకాంత్

ఇటీవల బాలకృష్ణ నుంచి వచ్చిన 'రూలర్' ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. ఆ సినిమాలో ఆయన విభిన్నమైన లుక్స్ తో కనిపించారు. తరువాత సినిమాలోను ఆయన విలక్షణమైన పాత్రలో కనిపించనున్నారని అంటున్నారు. బాలకృష్ణ తదుపరి సినిమా, బోయపాటి దర్శకత్వంలో రూపొందనుంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

ఈ సినిమాలోని కొన్ని ఎపిసోడ్స్ లో బాలకృష్ణ ఆధ్యాత్మిక వేత్తగా కనిపించనున్నాడని అంటున్నారు. బాలకృష్ణ అలా మారడానికి కారణం ఏమిటి? అంతకుముందు ఆయన పాత్ర తీరు తెన్నులేమిటి? అనేది ఆసక్తికరంగా మారింది. బాలకృష్ణ సరసన ఇద్దరు కథానాయికలు వుండనున్నట్టు తెలుస్తోంది. వాళ్ల ఎంపిక విషయంలో స్పష్టత రావలసి వుంది. ఈ సినిమాలో బాలకృష్ణను ఎదుర్కునే విలన్ గా శ్రీకాంత్ కనిపించనున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన విలన్ పాత్రలతో బిజీ అవుతాడేమో చూడాలి.

Boyapati Sreenu
Balakrishna
  • Loading...

More Telugu News