Balakrishna: వైసీపీ ఎమ్మెల్యే రోజా చేతిలోని ఆ సెల్ ఎవరిదో తేల్చండి: బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్

  • నిన్న బాలయ్యతో సెల్ఫీ దిగిన రోజా
  • శాసనమండలి లాబీల్లో ఘటన
  • నిషేధిత ప్రాంతానికి సెల్ ఎలా వచ్చిందన్న మాధవ్

నిన్న రాత్రి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సమావేశాలు హాట్ హాట్ గా సాగుతున్న వేళ, లాబీల్లో కూర్చుని ఉన్న బాలకృష్ణతో వైసీపీ ఎమ్మెల్యే రోజా దిగిన సెల్ఫీ వైరల్ అవుతున్న వేళ, బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ తీవ్రంగా మండిపడ్డారు. సెల్ ఫోన్లు అనుమతిలేని సభలోకి ఫోన్ ఎలా వచ్చిందని ఆయన ప్రశ్నించారు. ఆ సెల్ ఫోన్ ఎవరిదో వెంటనే తేల్చాలని, దాన్ని ఎవరు సభలోకి తెచ్చారో వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

రాజధాని విషయంలో గత ప్రభుత్వం ఓ రకమైన తప్పు చేస్తే, దాన్ని సరిదిద్దాల్సిన స్థానంలో ఉన్న ప్రస్తుత జగన్ సర్కారు, మరో రకమైన తప్పు చేస్తోందని మాధవ్ మండిపడ్డారు. మూడు రాజధానుల బిల్లు ఎలాగైతే ఆగిపోయిందో, ఇతర వివాదాస్పద నిర్ణయాలకు సంబంధించిన బిల్లులు కూడా అలాగే ఆగిపోతాయని ఆయన అంచనా వేశారు.

Balakrishna
Roja
Counsil
  • Loading...

More Telugu News