Botsa Satyanarayana Satyanarayana: 'టీడీపీ గతి ఏమవుతుందో...' అని నేను అనలేదు... కానీ కట్టుబడే ఉన్నా: బొత్స

  • 'తెలుగుదేశం గతి ఏమవుతుందో' అని బొత్స అన్నారంటూ వ్యాఖ్యలు
  • మండలిలో తీవ్రంగా స్పందించిన టీడీపీ సభ్యులు
  • టీడీపీని కూకటివేళ్లతో సహా పెకిలించాలన్న భావన మాత్రం ఉంది
  • క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదన్న బొత్స సత్యనారాయణ

ప్రముఖ తెలుగు దినపత్రిక 'ఆంధ్రజ్యోతి'లో వచ్చిన ఓ వార్త వివాదాస్పదం కాగా, ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. "శాసనమండలిలో తమ ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లులు ఆమోదం పొందకపోతే టీడీపీ గతి ఏమవుతుందో చూస్తా" అని బొత్స వ్యాఖ్యానించారంటూ, సదరు పత్రికలో వార్త రాగా, దీనిని తెలుగుదేశం పార్టీ సభ్యులు మండలిలో ప్రస్తావించారు. ఆ సమయంలో తీవ్ర వాగ్వాదం జరిగింది.

బొత్స సత్యనారాయణ మండలిని అగౌరవ పరిచారని, ఆయన తక్షణం క్షమాపణ చెప్పాలని ఆర్థికశాఖ మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు డిమాండ్‌ చేశారు. ఇక ఈ విషయంపై స్పందించిన బొత్స, తాను ఆ మాట అనలేదని స్పష్టం చేశారు. ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీని కూకటివేళ్లతో సహా పెకిలించివేయాలన్న భావనకు మాత్రం కట్టుబడే ఉన్నానని అన్నారు. ఓ పత్రికలో వచ్చిన వార్తపై క్షమాపణలు చెప్పాలని కోరితే, తాను చెప్పేది లేదని ఆయన స్పష్టం చేశారు.

Botsa Satyanarayana Satyanarayana
Telugudesam
Telugudesam
Counsil
  • Loading...

More Telugu News