Drunk Driving: మందు కొట్టి పట్టుబడింది 70 మంది... జరిమానా రూ. 7 లక్షలు!

  • హైదరాబాద్ లో డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు
  • గత వారాంతంలో దొరికిపోయిన మందుబాబులు
  • ఆరుగురికి ఐదు రోజుల జైలు శిక్ష

ఇటీవల హైదరాబాద్, నాంపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించగా, మొత్తం 70 మంది పట్టుబడ్డారు. వీరికి రూ. 7 లక్షల జరిమానాతో పాటు, పదేపదే పట్టుబడిన కొందరికి జైలు శిక్షలను విధిస్తూ, న్యాయస్థానం తీర్పిచ్చింది.

నాంపల్లి పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, గత వారాంతంలో మందు కొట్టి వాహనాలు నడిపే వారి కోసం స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించారు. పట్టుబడిన వారిని కోర్టు ముందు ప్రవేశపెట్టారు. వీరిలో 59 మందికి రూ. 10,500 చొప్పున జరిమానా విధించిన న్యాయమూర్తి, ఆరుగురికి రూ. 500 జరిమానా, ఐదు రోజుల జైలు శిక్ష, నలుగురికి రూ. 16,500 చొప్పున జరిమానా, ఒకరికి రూ. 16,500 జరిమానా, మూడు రోజుల జైలుశిక్ష విధించారని అన్నారు.

Drunk Driving
Hyderabad
Nampalli
Police
Court
Fine
  • Loading...

More Telugu News