Andhra Pradesh: మండలి చైర్మన్ నిర్ణయంపై సీపీఐ హర్షం... జగన్ ఇప్పటికైనా మొండిపట్టు వీడాలన్న రామకృష్ణ

  • వికేంద్రీకరణ బిల్లుకు మండలిలో చుక్కెదురు
  • బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపిన మండలి చైర్మన్
  • చైర్మన్ నిర్ణయాన్ని స్వాగతించిన సీపీఐ రామకృష్ణ

ఏపీ శాసనమండలిలో వికేంద్రీకరణ బిల్లును పాస్ చేయించుకోవాలనుకున్న వైసీపీ సర్కారు వ్యూహానికి విఘాతం ఎదురైంది. వికేంద్రీకరణ బిల్లును సెలెక్ట్ కమిటీ ముందుకు పంపాలని మండలి చైర్మన్ షరీఫ్ తనకున్న విచక్షణాధికారంతో నిర్ణయం తీసుకున్నారు. దీనిపై ఏపీ సీపీఐ కార్యదర్శి రామకృష్ణ హర్షం వ్యక్తం చేశారు.

వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ చట్టం ఉపసంహరణ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపడం హర్షణీయం అని ఆయన పేర్కొన్నారు. సీఎం జగన్ ఇప్పటికైనా మొండిపట్టు వీడాలని అన్నారు. అటు, రాజధాని అమరావతి ప్రాంతంలో మండలి పరిణామాలపై సంతోషం వ్యక్తమవుతోంది. రైతులు మండలి చైర్మన్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు.

Andhra Pradesh
AP Legislative Council
CPI
Ramakrishna
Jagan
  • Loading...

More Telugu News