Andhra Pradesh: మండలిలో నెలకొన్న సందిగ్ధతతో ఏజీని పిలిపించిన ప్రభుత్వం

  • వికేంద్రీకరణ బిల్లుపై మండలిలో రగడ
  • సెలెక్ట్ కమిటీ ముందుకు పంపే విషయంలో సందిగ్ధత
  • మండలికి చేరుకున్న అడ్వొకేట్ జనరల్

వికేంద్రీకరణ బిల్లును శాసనమండలిలో ఆమోదింపజేసుకునేందుకు వైసీపీ ప్రభుత్వం సర్వశక్తులు ఒడ్డుతోంది. ఇప్పటికి రూల్ నెం.71 శాంపిల్ మాత్రమేనని, బిల్లును మండలిలో అడ్డుకునేందుకు చాలా అస్త్రాలు ఉన్నాయని టీడీపీ పేర్కొన్న నేపథ్యంలో ప్రభుత్వం మరింత పట్టుదల ప్రదర్శిస్తోంది. వికేంద్రీకరణ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపే విషయం ఎటూ తేలకపోవడంతో సలహా సంప్రదింపుల కోసం ప్రభుత్వం అడ్వొకేట్ జనరల్ ను శాసనమండలికి పిలిపించింది. కొద్దిసేపటి క్రితమే ఏజీ మండలికి వచ్చారు. మండలిలో నెలకొన్న సందిగ్ధతను ఏజీ సాయంతో తొలగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ బిల్లు సెలెక్ట్ కమిటీ ముందుకు వెళ్లరాదని సర్కారు కృతనిశ్చయంతో ఉంది.

Andhra Pradesh
AP Legislative Council
Telugudesam
YSRCP
Select Committee
AG
  • Loading...

More Telugu News