GVL Narasimha Rao: కొత్త కూటమి రేపు ఉదయం జేపీ నడ్డాను కలుస్తుంది: బీజేపీ ఎంపీ జీవీఎల్

  • బీజేపీ- జనసేన ఢిల్లీ పర్యటన నిన్నటికి నిన్నే నిర్ణయం
  • బీజేపీ కొత్త అధ్యక్షుడు నడ్డాను కలిసి అభినందిస్తాం
  • ఏపీ రాజకీయాలపై ఆయన వద్ద ప్రస్తావిస్తాం 

భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షుడు జేపీ నడ్డాను కొత్తగా ఏర్పడ్డ బీజేపీ-జనసేన కూటమి రేపు కలవనున్నట్టు ఎంపీ జీవీఎల్ నరసింహారావు వెల్లడించారు. ఢిల్లీలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమవేశంలో ఆయన మాట్లాడుతూ, బీజేపీ- జనసేన నేతల ఢిల్లీ పర్యటన నిన్నటికి నిన్న అనుకుని నిర్ణయించామని చెప్పారు.

ఇవాళ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ని కలిశామని, రేపు ఉదయం తొమ్మిదిన్నర గంటలకు జేపీ నడ్డాను తమ కూటమి కలిసి, ఆయన్ని అభినందించాలని నిర్ణయించినట్టు చెప్పారు. ఏపీ రాజకీయ అంశాల గురించి నడ్డా వద్ద ప్రస్తావించాలని, తమ కూటమి కార్యాచరణ గురించి ఆయనకు వివరించాలని అనుకున్నట్టు చెప్పారు.

కో-ఆర్డినేషన్ కమిటీలలో ఎవరెవరు ఉన్నారన్న ప్రశ్నకు జీవీఎల్ స్పందిస్తూ, ప్రెస్ నోట్ ద్వారా రేపు తెలియజేస్తామని చెప్పారు. రెండు పార్టీల నుంచి ఎవరెవరు సభ్యులుగా ఉండబోతున్నారో రెండు పార్టీల అధినేతల నుంచి ప్రెస్ నోట్లు విడుదల చేస్తామని స్పష్టం చేశారు.

GVL Narasimha Rao
BJP
JP Nadda
Janasena
  • Loading...

More Telugu News