Janasena: బీజేపీ-జనసేన కలిసి ఫిబ్రవరి 2న ‘లాంగ్ మార్చ్’ నిర్వహిస్తాం: నాదెండ్ల మనోహర్

  • రాజధాని రైతులకు సంఘీభావంగా ఈ మార్చ్
  • తాడేపల్లి - విజయవాడలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వరకు  
  • కవాతు తరహాలో ‘లాంగ్ మార్చ్’ నిర్వహిస్తాం

రాజధాని రైతులు చేస్తున్న ఆందోళనకు సంఘీభావం తెలిపేందుకు, ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగట్టడం కోసం ‘లాంగ్ మార్చ్’ నిర్వహించాలని బీజేపీ-జనసేనలు నిర్ణయించాయని జనసేన నేత నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఫిబ్రవరి 2వ తేదీన మధ్యాహ్నం రెండు గంటలకు తాడేపల్లి నుంచి విజయవాడలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వరకు ‘లాంగ్ మార్చ్’ ను కవాతు తరహాలో నిర్వహిస్తామని చెప్పారు.

రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ ఒక చక్కటి అభిప్రాయానికి రావాల్సిన సమయం వచ్చిందని అన్నారు. నిజాయతీగా విలువలతో కూడిన రాజకీయాల కోసం, యువతకు ఆదర్శవంతంగా ఉండటం కోసం, రాష్ట్ర ప్రజల మనోభావాలను అందరి దృష్టికి తీసుకెళ్లి వారికి న్యాయం చేసేందుకు కలిసి పోరాటం చేయాలన్న స్పష్టమైన నిర్ణయం రెండు పార్టీలు తీసుకున్నట్టు వివరించారు.

Janasena
Nadendla Manohar
BJP
Long March
  • Loading...

More Telugu News