Telangana Municipal Elections: బోధన్ లో టీఆర్ఎస్ అభ్యర్థి ముక్కు కొరికేసిన కాంగ్రెస్ అభ్యర్థి!

  • బోధన్ లోని 32వ వార్డులో ఘటన
  • దొంగ ఓట్లు వేస్తున్నారన్న టీఆర్ఎస్ అభ్యర్థి ఇమ్రాన్
  • ఆక్షేపించిన కాంగ్రెస్ అభ్యర్థి ఇలియాస్

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా.. టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య నెలకొన్న వాగ్వాదం తీవ్రమై పరస్పరం దాడులకు దారితీసిన ఘటన నిజామాబాద్ జిల్లా, బోధన్ లో చోటుచేసుకుంది. దొంగ ఓట్లు వేస్తున్నారని 32వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి ఇమ్రాన్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థి ఇలియాస్ తో గొడవపడ్డాడు.

ఈ గొడవ తీవ్రం కావడంతో.. ఇమ్రాన్ ముక్కును ఇలియాస్ కొరికేశాడు. ఇమ్రాన్ ముక్కునుంచి తీవ్రంగా రక్త స్రావం కావడంతో అతడిని చికిత్సకోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. కాగా, పోలీసులు ఇలియాస్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన అనంతరం పోలింగ్ యథాతథంగా కొనసాగింది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News