Nirmala Sitharaman: నిర్మలా సీతారామన్ తో జనసేన, బీజేపీ నేతలం చర్చించాం: ఎంపీ జీవీఎల్

  • కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తో గంట పాటు చర్చ
  • పవన్ కల్యాణ్, నాదెండ్ల, కన్నా.. పాల్గొన్నాం
  • బీజేపీ-జనసేన కూటమి కార్యాచరణ ఏ విధంగా ఉండాలో విస్తృతంగా చర్చిస్తాం

ఢిల్లీలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ టూర్ కొనసాగుతోంది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తో జనసేన, బీజేపీ నేతల భేటీ ముగిసింది. అనంతరం, మీడియాతో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ, కేంద్ర ఆర్థిక మంత్రి, ఆంధ్రప్రదేశ్ కు కోడలు అయిన నిర్మలాసీతారామన్ తో ఈరోజు జరిపిన సమావేశం ముగిసిందని చెప్పారు.

బీజేపీ-జనసేన నాయకులం ఆమెతో భేటీ అయ్యామని, దాదాపు గంట సమయం చర్చించామని అన్నారు. ఈ సమావేశంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, పురందేశ్వరి, సునీల్, పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్, తాను పాల్గొని చర్చించామని అన్నారు. సమావేశం వివరాలను కన్నా, పవన్ కల్యాణ్ వివరిస్తారని చెప్పారు. ఈరోజు సాయంత్రం బీజేపీ-జనసేన కూటమి కార్యాచరణ ఏ విధంగా ఉండాలో విస్తృతంగా చర్చిస్తామని అన్నారు.

Nirmala Sitharaman
GVL
Pawan Kalyan
Kanna
  • Loading...

More Telugu News