Andhra Pradesh: 'ఇన్ సైడర్' అక్రమాలపై దర్యాప్తు తీర్మానం ఆమోదం పొందింది.... ఇక బాబు అక్రమాలు బయటికొస్తాయి: విజయసాయి

  • ట్విట్టర్ లో వెల్లడించిన విజయసాయి
  • చంద్రబాబు ఓ ద్రోహి అంటూ విమర్శలు
  • చట్టానికి ఎవరూ అతీతులు కాలేరంటూ వ్యాఖ్యలు

అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందన్న ఆరోపణలపై లోతైన దర్యాప్తు కోసం అసెంబ్లీలో తీర్మానం ఆమోదం పొందిందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు పాల్పడిన అక్రమాలన్నీ ఈ దర్యాప్తుతో వెలుగులోకి వస్తాయని తెలిపారు.

రాజధానిని అమరావతిలో ఏర్పాటు చేయడం వెనుక చంద్రబాబు రహస్య అజెండా, కుట్రలు, కుతంత్రాలు, కుంభకోణాలు, స్వార్థ ప్రయోజనాలు అన్నీ బయటికి వస్తాయని విజయసాయి ట్వీట్ చేశారు. చంద్రబాబు ఓ ద్రోహి అని, తీవ్రస్థాయిలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడని ఆరోపించారు. చట్టానికి ఎవరూ అతీతులు కారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు.

Andhra Pradesh
Andhra Pradesh Assembly
Vijay Sai Reddy
Telugudesam
Chandrababu
YSRCP
Amaravati
AP Capital
Insider Trading
  • Loading...

More Telugu News