Akhil: అఖిల్ కోసం ట్రై చేస్తున్న హరీశ్ శంకర్

  • మాస్ ఆడియన్స్ నుంచి మంచి మార్కులు 
  • రీసెంట్ హిట్ గా 'గద్దలకొండ గణేశ్'
  • అఖిల్ ను ఒప్పించే ప్రయత్నం చేస్తున్న హరీశ్ శంకర్  

తెలుగులో పూరి .. వినాయక్ తరువాత మాస్ ఆడియన్స్ పల్స్ తెలిసిన దర్శకుడిగా హరీశ్ శంకర్ కి మంచి పేరు వుంది. ఆయన నుంచి ఇటీవల వచ్చిన 'గద్దలకొండ గణేశ్' కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అప్పటి నుంచి హీరోలకి కథలను వినిపిస్తూ తన ప్రయత్నాలను తను చేస్తూనే వున్నాడు. అయితే యువ కథానాయకులంతా వరుస ప్రాజెక్టులతో బిజీగా వున్నారు. అందువలన వాళ్లకి తీరుబడి కావడానికి చాలా సమయం పడుతుంది.

ఈ నేపథ్యంలో అఖిల్ పై హరీశ్ శంకర్ దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం 'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ ఒక సినిమా చేస్తున్నాడు. ఆ తరువాత సినిమాకిగాను ఆయన ఎవరికీ ఓకే చెప్పలేదు. అందువలన అఖిల్ ను ఒప్పించే ప్రయత్నంలో హరీశ్ శంకర్ ఉన్నాడనే టాక్ ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది. కథ నచ్చి, అఖిల్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఆయనతోనే హరీశ్ శంకర్ సినిమా ఉంటుందన్న మాట.

Akhil
Harish Shankar
  • Loading...

More Telugu News