Andhra Pradesh: ఢిల్లీ చేరుకున్న పవన్ కల్యాణ్, నాదెండ్ల

  • ఈ ఉదయం ఢిల్లీ బయల్దేరిన పవన్
  • నిర్మలా సీతారామన్ తో భేటీ అయ్యే అవకాశం
  • జనసేన, బీజేసీ సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొననున్న పవన్

గత కొన్నిరోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే జనసేనాని పవన్ కల్యాణ్ స్పీడు పెంచినట్టు అర్థమవుతోంది. ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలతో మాట్లాడి మైత్రి కుదుర్చుకుని వచ్చి ఇక్కడి రాజకీయ వర్గాలను పవన్ ఆశ్చర్యంలో ముంచెత్తారు. తాజాగా మరోసారి ఆయన ఢిల్లీ వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. పార్టీలో నెంబర్ 2గా కొనసాగుతున్న నాదెండ్ల మనోహర్ తో కలిసి కొద్దిసేపటి క్రితమే ఆయన ఢిల్లీ చేరుకున్నారు. మరికాసేపట్లో పవన్ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ కానున్నారు. ఆపై, జనసేన-బీజేపీ సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొంటారు.

Andhra Pradesh
Pawan Kalyan
Janasena
Nadendla Manohar
  • Loading...

More Telugu News