Varla Ramaiah: మానవహక్కుల కమిషన్ తలుపు తడతాం.. ప్రభుత్వ భరతం పడతాం: వర్ల రామయ్య

  • అమరావతి ప్రజలపై పోలీసుల దాడి దారుణం
  • విలేకరులపై పోలీసుల దౌర్జన్యం గర్హనీయం
  • గ్రామాల్లో భయానక వాతావరణాన్ని సృష్టించారు

అమరావతి ప్రాంతంలో దీక్ష చేస్తున్న గ్రామస్తులపై పోలీసుల దాడి దారుణమని టీడీపీ నేత వర్ల రామయ్య అన్నారు. ముఖ్యమంత్రి జగన్ ను ఉద్దేశించి ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ, కొన్ని చానళ్ల విలేకరులపై పోలీసుల దౌర్జన్యం గర్హనీయమని వ్యాఖ్యానించారు. మందడం గ్రామం మొత్తాన్ని పోలీసులు తమ నియంత్రణలో పెట్టుకున్నారని... ఇది గ్రామస్తుల హక్కులను హరించడమేనని చెప్పారు. దీనిపై మానవహక్కుల కమిషన్ తలుపు తడతామని... ప్రభుత్వ భరతం పడతామని అన్నారు. గ్రామాల్లో భయానక వాతావరణాన్ని సృష్టించడం దగాకోరుతనమేనని విమర్శించారు.

Varla Ramaiah
Telugudesam
Jagan
YSRCP
  • Loading...

More Telugu News