Buggana Rajendranath: 'మండలి'లో స్మార్ట్‌ఫోన్‌ చూస్తూ జీవో చదివిన లోకేశ్.. మండిపడ్డ మంత్రులు బొత్స, బుగ్గన

  • నవరత్నాల కోసం చర్చిలు, మసీదుల భూములు విక్రయించారన్న లోకేశ్
  • జీవో ఇచ్చారని ఆరోపణ
  • సభలోకి సెల్‌ఫోన్ తీసుకురావడం సంప్రదాయాలకు విరుద్ధమన్న బొత్స

ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. స్మార్ట్‌ఫోన్‌ చూస్తూ ఆయన ప్రసంగించారు. నవరత్నాల కోసం చర్చిలు, మసీదుల భూములు విక్రయించేందుకు జీవో ఇచ్చారని ఆయన ఆరోపించారు. దీంతో ఆయనపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. సభలోకి సెల్‌ఫోన్ తీసుకురావడం సంప్రదాయాలకు విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అనంతరం బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడుతూ తమపై చేసిన ఆరోపణలు నిరూపించాలని లోకేశ్‌కు సవాలు విసిరారు. లోకేశ్ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు చెప్పారు. లోకేశ్ చదివివినిపించిన ఆ జీవో ఎక్కడ ఉందో చూపించాలని డిమాండ్ చేశారు. కనీసం ఆ జీవో నంబర్ అయినా చెప్పాలని అన్నారు. లేదంటే సభకు లోకేశ్‌ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

Buggana Rajendranath
  • Loading...

More Telugu News