redmi: రెడ్‌మిలో అందుబాటులోకి వైఫై కాలింగ్ సదుపాయం
- ఎయిర్‌టెల్, జియో వైఫై ద్వారా వినియోగించుకోవచ్చని ప్రకటన
- వైఫై కాల్ ఫీచర్‌లకు అనుగుణంగా ఇప్పటికే ఎయిర్‌టెల్, జియో సేవలు
- ఎటువంటి అదనపు ఛార్జీలు ఉండవు
తమ కంపెనీ స్మార్ట్‌ఫోన్లలో వైఫై కాలింగ్ సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు రెడ్‌మి తెలిపింది. టెలికాం సంస్థలు భారతి ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో వైఫై ద్వారా ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని తెలిపింది. స్మార్ట్‌ఫోన్‌లలో ఉండే వైఫై కాల్ ఫీచర్‌లకు అనుగుణంగా ఇప్పటికే ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో తమ వైఫై నెట్‌వర్క్‌ల ద్వారా వైఫై కాలింగ్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చాయి.
దేశవ్యాప్తంగా వై ఫై కాలింగ్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చామని ఇటీవల ఎయిర్‌టెల్ అధికారికంగా ప్రకటించింది. తమ వైఫై చందాదారుల సంఖ్య 10 లక్షలు దాటిందని తెలిపింది. రిలయన్స్ జియో కూడా ఈ సదుపాయాన్ని కొన్ని పరిమిత ప్రాంతాలల్లో అందుబాటులోకి తీసుకొచ్చింది.
వైఫ్ కాలింగ్ సేవలకుగానూ అదనంగా ఎటువంటి ఛార్జీలు చెల్లించాల్సి ఉండదు. రెడ్‌మి వంటి స్మార్ట్‌ఫోన్‌లలో వీఓ వైఫై టెక్నాలజీతో పబ్లిక్ హాట్‌స్పాట్ లేదా ప్రైవేట్ హోం వైఫై నెట్‌వర్క్‌కు అనుసంధానం చేసుకొని మీ మొబైల్ నుంచి ఇతర ఏ మొబైల్ ఫోన్‌కైనా లేక ల్యాండ్‌లైన్‌కైనా కాల్స్ చేసుకోవచ్చు.