budda venkanna: 'దావోస్' సదస్సుకి కేటీఆర్ వెళ్లారు.. మరి ఏపీ నుంచి ఎవరూ వెళ్లలేదా?: బుద్ధా వెంకన్న చురకలు

  • బొత్స, కొడాలి నాని, అ'నిల్', పేర్ని నాని లాంటి టీంని పంపాలి
  • బొత్స గారు వోక్స్ వ్యాగన్ కంపెనీని తీసుకొస్తారు
  • కొడాలి నాని గారు సన్న బియ్యం ఇంపోర్ట్ చేసే వారిని ఆకర్షిస్తారు
  • జగన్ గారు అయితే లక్ష కోట్ల పెట్టుబడులని తీసుకు వస్తారు 

దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో తెలంగాణ తరఫున ఆ రాష్ట్ర మంత్రి కేటీఆర్ వెళ్లి పెట్టుబడుల కోసం కృషి చేస్తున్నారని వార్తలు వస్తున్నాయని, మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎవరూ వెళ్ల లేదా? అని టీడీపీ నేత బుద్ధా వెంకన్న వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
 
'బొత్స, కొడాలి నాని, అ'నిల్', పేర్ని నాని లాంటి టీంని అక్కడకు పంపించాలని, దీనికి జగన్ గారు సారథ్యం వహించాలని డిమాండ్ చేస్తున్నాం' అంటూ బుద్ధా వెంకన్న ట్వీట్ చేశారు.
 
'బొత్స గారు వోక్స్ వ్యాగన్ ని, కొడాలి నాని గారు సన్న బియ్యం ఇంపోర్ట్ చేసే వారిని, అ'నిల్' గారు దబరాలో నీళ్లు పట్టే కంపెనీలని, పేర్ని నాని గారు బస్సులు తయారు చేసే కంపెనీలని, జగన్ గారు అయితే లక్ష కోట్ల పెట్టుబడులని తీసుకు వస్తారు' అంటూ ఎద్దేవా చేశారు. 

budda venkanna
YSRCP
Telugudesam
KTR
  • Loading...

More Telugu News