Andhra Pradesh Assembly: అసెంబ్లీలో స్పీకర్ పోడియంను చుట్టుముట్టిన టీడీపీ సభ్యులు

  • జై అమరావతి, శుక్రవారం కోర్టుకు వెళ్లాలంటూ నినాదాలు 
  • టీడీపీ సభ్యుల ఆందోళనపై మండిపాటు 
  • సభ్యుల ఆందోళన మధ్యే మంత్రుల ప్రసంగాలు

శాసన సభలో ఈ రోజు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. తెలుగుదేశం పార్టీ సభ్యులు స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. 'జై అమరావతి, శుక్రవారం కోర్టుకు వెళ్లాలి' అంటూ నినదించారు. టీడీపీ సభ్యుల తీరుపై అధికార పార్టీ సభ్యులు మండిపడ్డారు. మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

అమ్మఒడి, రైతుభరోసా వంటి కీలక అంశాలపై సభలో చర్చ జరుగుతున్నప్పుడు సభ్యులు ఇలా ప్రవర్తించడం ఏం బాగా లేదని మంత్రి కన్నబాబు తప్పుపట్టారు. ఓ వైపు టీడీపీ సభ్యులు ఆందోళన చేస్తుండగానే, మరోవైపు మంత్రులు తమ ప్రసంగాలు కొనసాగించారు. ఉత్తరాంధ్రకు రాజధాని వస్తుంటే అక్కడి ఎమ్మెల్యేలు అడ్డుకోవడం మరీ దారుణమని వ్యాఖ్యానించారు.

Andhra Pradesh Assembly
Telugudesam mlas
speaker podiam
jai amaravati
  • Loading...

More Telugu News