thammineni: మార్షల్స్ ను పిలిపించిన స్పీకర్ తమ్మినేని

  • టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ తమ్మినేని సీతారాం మనస్తాపం
  • ఇదే పరిస్థితి కొనసాగితే ఎటువంటి చర్యలకైనా సిద్ధమని ప్రకటన
  • టీడీపీ చర్యలతో ఇతర సభ్యుల హక్కులు హరించిపోతున్నాయని వ్యాఖ్య

రైతు భరోసా కేంద్రాలపై చర్చ జరుగుతోన్న సమయంలో శాసనసభలో టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ తమ్మినేని సీతారాం తీవ్ర మనస్తాపం చెందారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఎటువంటి చర్యలకైనా సిద్ధమని ప్రకటించారు. టీడీపీ సభ్యుల చర్యలతో ఇతర సభ్యుల హక్కులు హరించిపోతున్నాయని అన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు సీట్లలో కూర్చోవాలని కోరారు. అయినప్పటికీ టీడీపీ సభ్యులు వెనక్కి తగ్గట్లేదు. దీంతో తమ్మినేని 'ఇది మీ ఇల్లనుకుంటున్నారా?' అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలోకి ఆయన మార్షల్స్‌ను పిలిపించారు. గందరగోళం మధ్యే సభ కొనసాగుతోంది.

thammineni
Andhra Pradesh
Amaravati
  • Loading...

More Telugu News