Nara Lokesh: పిచ్చయ్యగారి మృతి నన్ను తీవ్రంగా కలచివేసింది: నారా లోకేశ్

  • రాజధాని తరలిపోతోందనే ఆందోళనలో అమరావతి రైతులు
  • అనంతవరం గ్రామానికి చెందిన పిచ్చయ్య మృతి
  • జగన్ అనాలోచిత నిర్ణయాల వల్ల రైతులు బలైపోతున్నారన్న లోకేశ్

రాష్ట్రానికి మూడు రాజధానుల బిల్లును అసెంబ్లీ ఆమోదించడంతో అమరావతి ప్రాంత రైతుల్లో ఆందోళన తీవ్రతరమైంది. అమరావతికి అన్యాయం చేయవద్దని వారు కంటతడి పెడుతున్నారు. రాజధాని తరలిపోతోందన్న ఆందోళనతో అనంతవరం గ్రామానికి చెందిన పిచ్చయ్య అనే రైతు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై టీడీపీ నేత నారా లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. పిచ్చయ్యగారి మృతి తనను తీవ్రంగా కలచివేసిందని చెప్పారు. రైతులకు న్యాయం జరిగేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. రైతులను పొట్టన పెట్టుకున్న పాపం ఊరికే పోదు జగన్ గారూ అంటూ లోకేశ్ ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి అనాలోచిత నిర్ణయాల వల్ల రైతులు బలైపోతున్నారని విమర్శించారు.

Nara Lokesh
Telugudesam
Amaravati
Farmer
Jagan
YSRCP
  • Loading...

More Telugu News