punjab: పంజాబ్‌లో పీసీసీ, డీసీసీలను రద్దు చేసిన సోనియాగాంధీ
- సోమవారం సోనియాతో భేటీ అయిన పంజాబ్ సీఎం
- నిన్న అన్ని కమిటీలను రద్దు చేస్తూ సోనియా నిర్ణయం
- పీసీసీ చీఫ్ మాత్రం కొనసాగుతారని స్పష్టీకరణ
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్‌సింగ్‌తో సోమవారం సోనియా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరూ పలు విషయాలపై సుదీర్ఘంగా చర్చించుకున్నారు. అనంతరం నిన్న సోనియా కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. పంజాబ్‌లోని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ), జిల్లా కమిటీ (డీసీసీ)లను రద్దు చేశారు. ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వచ్చినట్టు తెలిపారు. అయితే, పీసీసీ అధ్యక్షుడిగా మాత్రం సునీల్ జాఖడ్ మాత్రం కొనసాగుతారని స్పష్టం చేశారు. పీసీసీ, డీసీసీలను రద్దు చేసిన కాంగ్రెస్.. వాటి పునరుద్ధరణకు సంబంధించి ఎటువంటి ప్రకటన చేయలేదు. దీంతో కాంగ్రెస్ శ్రేణుల్లో అయోమయం నెలకొంది.