Rajinikanth: రజనీకాంత్ వ్యాఖ్యలపై మద్రాస్ హైకోర్టుకెక్కిన ద్రవిడర్ కళగమ్

  • రాజకీయంగా పేరు తెచ్చుకునేందుకే రజనీ వ్యాఖ్యలు
  • ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందేనంటూ పిటిషన్
  • క్షమాపణలు చెప్పేది లేదని ఇప్పటికే స్పష్టం చేసిన సూపర్‌స్టార్

ప్రముఖ సంఘ సంస్కర్త పెరియార్‌ (ఈవీ రామస్వామి నాయకర్)పై సూపర్‌స్టార్ రజనీకాంత్ చేసిన వ్యాఖ్యల దుమారం ఆగడం లేదు. పెరియార్‌పై తాను చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పేది లేదని రజనీ ఇప్పటికే స్పష్టం చేశారు. గతంలో తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్టు తేల్చి చెప్పారు. దీంతో ఆయన వ్యాఖ్యలను నిరసిస్తూ ద్రవిడర్ కళగమ్ కార్యకర్తలు గత కొన్ని రోజులుగా రజనీ ఇంటి ఎదుట ఆందోళన చేస్తున్నారు.

తాజాగా, రజనీకాంత్‌పై చర్యలు తీసుకోవాలంటూ ద్రవిడర్ కళగమ్ కార్యదర్శి నిన్న మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పెరియార్ గురించి తప్పుడు వ్యాఖ్యలు చేసిన రజనీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజకీయంగా పేరు తెచ్చుకునేందుకే ఆయన ఇలా మాట్లాడారని ఆరోపించారు. కాగా, ద్రవిడర్ కళగమ్ సభ్యులు ఇప్పటికే రజనీకాంత్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Rajinikanth
madras high court
case
Tamil Nadu
  • Loading...

More Telugu News