Shubh Mangal Zyada Saavdhan: ఇద్దరు యువకుల మధ్య ప్రేమ కథాంశంగా సాగే ‘శుభ్‌ మంగళ్‌ జ్యాదా సావధాన్‌’

  • రోమాంటిక్, డ్రామా, కామెడీ నేపథ్యంలో రూపొందిన చిత్రం
  • చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదల
  • ఫిభ్రవరి 21న విడుదలకు సిద్ధం

వినూత్న కథాంశాలతో ప్రేక్షకులముందుకు వచ్చే బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా తాజాగా ఇద్దరు అబ్బాయిల ప్రేమ కథాంశంగా తెరకెక్కిన.. పెళ్లితో మరింత జాగ్రత్త అన్న అర్ధాన్నిచ్చే  ‘శుభ్‌ మంగళ్‌ జ్యాదా సావధాన్‌’ సినిమా ద్వారా అలరించనున్నాడు.  రెండేళ్ల క్రితం.. పెళ్లితో జాగ్రత్త అన్న అర్ధం వచ్చేలా‘శుభ్ మంగళ్ సావధాన్’ చిత్రంతో  ఆయుష్మాన్ ప్రేక్షకులకు  వినోదాన్ని పంచాడు.  

తాజా చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను చిత్ర యూనిట్ నిన్న విడుదల చేసింది. ఇద్దరు యువకుల మధ్య సాగే ‘గే’ ప్రేమ కథాంశంతో వినోద భరిత చిత్రంగా ‘శుభ్‌ మంగళ్‌ జ్యాదా సావధాన్‌’ ను  రూపొందించారు.  ట్రైలర్ లో సంభాషణ కూడా ప్రేక్షులను ఆకట్టుకుంటోంది. నువ్వు ప్రేమించింది అబ్బాయిని అని కుమారుడితో ఓ తండ్రి చెప్పడం.. పెళ్లి మండపంలో ఆయుష్మాన్ మరో నటుడి పెదవులను ముద్దుపెట్టుకోవడం వంటి సీన్లు అకట్టుకున్నాయి. హితేశ్ కేవల్య దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిభ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.  

Shubh Mangal Zyada Saavdhan
Bollywood
Movie
India
  • Loading...

More Telugu News