Sanju Samson: ధావన్ కు గాయం... న్యూజిలాండ్ టూర్ కు సంజూ శాంసన్

  • జనవరి 24 నుంచి న్యూజిలాండ్ లో భారత్ టూర్
  • ఆసీస్ తో వన్డే సందర్భంగా గాయపడిన ధావన్
  • ధావన్ స్థానాన్ని భర్తీ చేయనున్న శాంసన్

యువ వికెట్ కీపర్ సంజూ శాంసన్ కు మరోసారి టీమిండియాకు ఆడే అవకాశం వచ్చింది. ఓపెనర్ శిఖర్ ధావన్ ఆసీస్ తో వన్డే సిరీస్ సందర్భంగా గాయపడ్డాడు. ధావన్ గాయం తీవ్రత దృష్ట్యా న్యూజిలాండ్ తో టి20 సిరీస్ కు పక్కనపెట్టారు. ధావన్ స్థానాన్ని సంజూ శాంసన్ తో భర్తీ చేయాలని నిర్ణయించారు. జనవరి 24 నుంచి న్యూజిలాండ్ లో టీమిండియా పర్యటన షురూ కానుంది. న్యూజిలాండ్ లో టీమిండియా టీ20, వన్డే, టెస్టు సిరీస్ లు ఆడనుంది. సుదీర్ఘమైన ఈ విదేశీ పర్యటన కోహ్లీ సేన సామర్ధ్యానికి సిసలైన సవాల్ అనడంలో సందేహంలేదు.

Sanju Samson
Sikhar Dhawan
New Zealand
India
Injury
  • Loading...

More Telugu News