Jagan: జగన్ సంపాదనలో నుంచి తమకు జీతాలిస్తున్నారని పోలీసులు అనుకుంటున్నారేమో!: సబ్బం హరి

  • రైతులపై పోలీసుల దాడులు దారుణం
  • పోలీసుల దారుణం డీజీపీకి కనిపించటం లేదా?
  • రాజధాని తరలింపుపై ఏదో రహస్యం ఉంది

రాజధాని అమరావతిని తరలించవద్దంటూ రైతులు చేస్తున్న నిరసనలపై పోలీసులు వ్యవహరిస్తున్న తీరును మాజీ ఎంపీ సబ్బం హరి తప్పుబట్టారు. రైతులపై, మహిళలపై పోలీసులు దాడులు చేస్తుండటం దారుణమని, వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు.

జగన్ సంపాదనలో నుంచి తమకు జీతాలు ఇస్తున్నారని పోలీసులు అనుకుంటున్నారేమో అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారో డీజీపీకి కనిపించటం లేదా? అని ప్రశ్నించారు. తెలుగు జాతి కోసం భూములు ఇచ్చిన వారిని లాఠీలతో చితగ్గొట్టి గౌరవిస్తున్నామంటూ వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు గక్కారు. విశాఖకు రాజధానిని తరలించడం వెనుక ఏదో రహస్యం ఉందని, అది త్వరలోనే విశాఖ వాసులు తెలుసుకుంటారని అన్నారు.

Jagan
cm
politics
Analyst
Sabbam Hari
  • Loading...

More Telugu News