Sabbam Hari: వీళ్లు మనుషులు కాదు.. వీళ్లది రాక్షస మనస్తత్వం: వైసీపీ నేతలపై సబ్బం హరి ఫైర్

  • రైతుల పక్షాన అసెంబ్లీలో సీఎం సహా మంత్రులు మాట్లాడలేదు
  • రైతులకు నష్టం రాదని చెప్పే మనసు కూడా వీళ్లకు లేదు
  • వీళ్లది క్రిమినల్ మైండ్ సెట్

రాజధానికి భూములు ఇచ్చిన రైతుల పక్షాన అసెంబ్లీలో సీఎం జగన్ సహా మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు ఒక్కరైనా మాట్లాడారా? అని మాజీ ఎంపీ సబ్బం హరి ప్రశ్నించారు. రైతులకు నష్టం రాదని చెప్పడానికి కూడా వారికి మనసు ఒప్పలేదంటే ‘వీళ్లు మనుషులు కాదు, వీళ్లది రాక్షస మనస్తత్వం’ అంటూ వారిపై విరుచుకుపడ్డారు.

రాజధాని అమరావతిని తరలించడానికి గల ఒకే ఒక కారణం అక్కడ ‘చంద్రబాబునాయుడి మార్కు ఉండకూడదు’ అని, వైసీపీ ‘క్రిమినల్ మైండ్’తో వ్యవహరిస్తోందని ప్రభుత్వంపై మండిపడ్డారు. రాజధాని కోసం పేద, ధనిక, మధ్య తరగతి వాళ్లు భూములు ఇచ్చిన విషయాన్ని మర్చిపోయి వారిని లాఠీలతో కొట్టించడం దారుణమని ధ్వజమెత్తారు.

మహిళలపై అవమానకర రీతిలో ప్రవర్తించారని, రైతులకు మద్దతుగా నిలిచిన నేతలను అరెస్టు చేసి బస్సుల్లో తిప్పించారని, అవసరమైతే, చంద్రబాబునాయుడిని కూడా అదేవిధంగా చేయాలని చూస్తున్నారంటే వాళ్ల మైండ్ సెట్ ఎలా ఉందో అర్థమౌతుందని నిప్పులు చెరిగారు.

Sabbam Hari
YSRCP
Jagan
cm
Chandrababu
  • Loading...

More Telugu News