Andhra Pradesh: మండలి సమావేశాలు చూసేందుకు భారీగా తరలివెళ్లిన ఎమ్మెల్యేలు... నిండిపోయిన గ్యాలరీలు!

  • మండలి సమావేశాలు ఆసక్తికరం
  • మండలి బాటపడుతున్న ఎమ్మెల్యేలు
  • రూల్ 71పై చర్చకు చైర్మన్ అనుమతి

ఏపీ శాసనమండలిలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. అసెంబ్లీలో తిరుగులేని మెజారిటీ ఉన్న వైసీపీకి... శాసనమండలిలో మాత్రం సంఖ్యాబలం తక్కువగా వుంది. దీంతో వికేంద్రీకరణ బిల్లు పాస్ చేయించుకునేందుకు వైసీపీ నానా అగచాట్లు పడుతోంది. టీడీపీ సభ్యుల ఆధిపత్యం ఉండడంతో మండలిలో రూల్ 71పై చర్చకు చైర్మన్ షరీఫ్ అనుమతించడంతో అందరూ మండలి సమావేశాలపై ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య తీవ్రస్థాయిలో పోరాటాలు సాగుతుండడంతో ఎమ్మెల్యేలు సైతం మండలి బాటపట్టారు. అన్ని పార్టీల ఎమ్మెల్యేలు భారీగా తరలిరావడంతో మండలిలో గ్యాలరీలన్నీ నిండిపోయాయి. ప్రభుత్వం బొత్స, బుగ్గన వంటి 11 మంది మంత్రులను మండలిలో మోహరించింది.

Andhra Pradesh
Amaravati
AP Capital
Vizag
AP Legislative Council
Telugudesam
YSRCP
  • Loading...

More Telugu News