Andhra Pradesh: మండలిలో సీఆర్డీఏ రద్దు, అభివృద్ధి వికేంద్రీకణ బిల్లులు ప్రవేశ పెట్టిన మంత్రులు
- ఆక్షేపించిన టీడీపీ ఎమ్మెల్సీలు
- నిబంధన 71 కింద నోటీసులు ఇచ్చాం.. ఎలా అనుమతిస్తారు?
- ఛైర్మన్ పోడియం వద్ద బైఠాయింపు
ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో సీఆర్డీఏ రద్దు, అభివృద్ధి వికేంద్రీకణకు సంబంధించిన బిల్లులను మంత్రులు, బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్ ప్రవేశ పెట్టారు. ఛైర్మన్ ఈ బిల్లులను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు చెప్పగానే సభలో గందరగోళం చెలరేగింది. ప్రతిపక్ష టీడీపీ ఎమ్మెల్సీలు ఛైర్మన్ ప్రకటనను తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. స్పీకర్ వద్దకు దూసుకు వెళ్లారు. పోడియంను చుట్టుముట్టి ఛైర్మన్ వైఖరిపై నిరసన తెలిపారు. ఈ బిల్లులను ప్రవేశపెట్టకూడదంటూ.. నిబంధన 71 కింద నోటీసులు ఇచ్చినప్పటికీ.. వాటిని ప్రవేశపెట్టేందుకు ఎట్లా అనుమతిస్తారంటూ ఆందోళనకు దిగారు.