RRR: సార్.. నాది కూడా సేమ్ ఫీలింగ్: రాజమౌళి

  • 'ఆర్ఆర్ఆర్' లో అజయ్ దేవగణ్
  • అజయ్ పై సన్నివేశాలు చిత్రీకరించిన రాజమౌళి
  • సంతోషం వ్యక్తం చేసిన బాలీవుడ్ హీరో

'ఆర్ఆర్ఆర్' చిత్రం షూటింగ్ లో ఇవాళ ఆసక్తికర దృశ్యం ఆవిష్కృతమైంది. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ ఈ ప్రతిష్ఠాత్మక చిత్రంలో ఓ పాత్రలో కనిపించనున్నారు. తనపై చిత్రీకరించే సన్నివేశాల కోసం అజయ్ షూటింగ్ స్పాట్ కు రాగా, దర్శకుడు రాజమౌళి సహా చిత్ర యూనిట్ ఆయనకు సాదర స్వాగతం పలికింది. ఇక తొలిరోజు షూటింగ్ పూర్తయిన తర్వాత అజయ్ దేవగణ్ ట్విట్టర్ వేదికగా తన స్పందన వెలిబుచ్చారు.

2012 నుంచి రాజమౌళి సర్ తో అనేక విధాలుగా ప్రయాణిస్తున్నానని, ఇప్పుడు ఆయన దర్శకత్వంలో 'ఆర్ఆర్ఆర్' లో నటిస్తుండడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. దీనికి రాజమౌళి ఎంతో వినమ్రంగా బదులిచ్చారు. "సార్.. నేను కూడా మీలాగే సంతోషంగా ఫీలవుతున్నాను. తొలిరోజు షూటింగ్ అద్భుతంగా గడిచిపోయింది" అంటూ ట్వీట్ చేశారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న 'ఆర్ఆర్ఆర్' చిత్రంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధానపాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే.

RRR
Rajamouli
Ramcharan
Jr NTR
Ajay Devgan
Tollywood
Bollywood
  • Loading...

More Telugu News