Nara lokesh: తిరుగుబాటు మొదలైంది.. ఇక సమరమే: నారా లోకేశ్...

  • ట్విట్టర్ మాధ్యమంగా వ్యాఖ్య
  • అమరావతి ప్రాంతంలో కొనసాగుతున్న ఆందోళనలు
  • మూడు రాజధానుల బిల్లుపై శాసనమండలిలో చర్చ

మూడు రాజధానుల బిల్లును అమలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ లోని వైసీపీ ప్రభుత్వం ముందుకు వెళుతున్న నేపథ్యంలో అమరావతి ప్రాంత రైతులు, ప్రజలు తమ ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు. తమ పోరాటాన్ని ఆపేది లేదంటూ ప్రకటిస్తున్నారు. మరోపక్క టీడీపీ నేతలు, జేఏసీ నేతృత్వంలోని పార్టీలు ప్రభుత్వ నిర్ణయాన్ని విమర్శిస్తున్నాయి.

శాసన సభలో సీఆర్‌డీఏ రద్దు, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు అమోదింప చేసుకున్న ప్రభుత్వం శాసన మండలిలో వీటి ఆమోదానికి ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ నేత నారా లోకేశ్  ప్రభుత్వ వైఖరిని తీవ్ర స్థాయిలో నిరసించారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. తిరుగుబాటు మొదలైంది.. ఇక సమరమే అంటూ ఓ వ్యాఖ్యను పోస్ట్ చేశారు. అంతకుముందు శాంతి యుతంగా నిరసనలు తెలుపుతున్న తమ పార్టీ నేతలను అరెస్టు చేస్తారా అని సీఎం జగన్ ను ట్విట్టర్ మాధ్యమంగా ప్రశ్నించారు.

Nara lokesh
Twitter
Comments
  • Loading...

More Telugu News