Chandrababu: ఆ మురుగు గుంటలో రాజధానిని పెట్టడం చంద్రబాబు చేసిన తప్పు: నాదెండ్ల భాస్కరరావు

  • రాజధానిని నేను ఎంతో వ్యతిరేకించాను
  • శిలాఫలకాల కోసం కొత్త రాజధానిని మురుగు గుంటలో పెట్టారు 
  • బాబుదే కాదు జగన్ వ్యవహరిస్తున్న తీరు కూడా తప్పే

అమరావతిలో రాజధాని ఏర్పాటు చేయడం చంద్రబాబు చేసిన తప్పు అని మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు విమర్శించారు. ‘ఆ మురుగు గుంటలో రాజధాని పెట్టడం చాలా తప్పు. నేను ఎంతో వ్యతిరేకించాను. శిలాఫలకాల కోసం కొత్త రాజధానిని మురుగు గుంటలో పెట్టారు’ అని అన్నారు.

నాగార్జున యూనివర్శిటీకి దగ్గరోనో లేకపోతే గుంటూరులోనో రాజధాని ఏర్పాటు చేసినట్టయితే బాగుండేదని అభిప్రాయపడ్డారు. కౌన్సిల్ లో చంద్రబాబు మొనగాడు, శాసనసభలో జగన్ మొనగాడు అని, ఇప్పుడు వీళ్లిద్దరూ కొట్టుకుంటుంటే ప్రజలు ఏమైపోవాలి? అని ప్రశ్నించారు. చివరకు, కులాల పేరిట కూడా తిట్టుకుంటున్నారని, రాష్ట్రంలో ఇవాళ ప్రతిబంధకంగా వున్నది కేవలం రాజకీయాలే అని విమర్శించారు. చంద్రబాబుదే కాదు జగన్ వ్యవహరిస్తున్న తీరు కూడా తప్పే అంటూ ఇద్దరు నేతలను తూర్పారబట్టారు.

Chandrababu
Jagan
Nadendla Bhasker Rao
AP Capital
Amaravati
Guntur
Nagarjuna University
  • Loading...

More Telugu News