Telangana: సీఎం కేసీఆర్ ఒత్తిడి వల్లే కరీంనగర్ కు స్మార్ట్ హోదా వచ్చింది: వినోద్ కుమార్

  • స్మార్ట్ సిటీ పనులను పర్యవేక్షించిన వినోద్
  • అద్భుతమైన పార్క్ ఏర్పాటు చేస్తున్నామని వెల్లడి
  • త్వరలోనే పనులు పూర్తవుతాయన్న ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు

దేశంలో అనేక నగరాలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణలో కరీంనగర్ కు స్మార్ట్ సిటీ హోదా రావడానికి సీఎం కేసీఆర్ కృషి చేశారని, ఆయన ఒత్తిడి వల్లే కేంద్రం కరీంనగర్ ను కూడా స్మార్ట్ సిటీల జాబితాలో చేర్చిందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ తెలిపారు.

 స్మార్ట్ సిటీ పథకం కింద కరీంనగర్ లో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ పథకం కింద విడుదలైన నిధులతో కరీంనగర్ లో అద్భుతమైన పార్క్ రూపొందిస్తున్నామని, ఇందులో ఓపెన్ ఎయిర్ థియేటర్ కూడా ఉంటుందని తెలిపారు. స్మార్ట్ సిటీ పనులు వేగంగా జరుగుతున్నాయని, పనులన్నీ పూర్తయితే కరీంనగర్ సిటీ ఎంతో అందంగా మారిపోతుందని వివరించారు.

Telangana
Karim Nagar
Smart City
Vinod
KCR
  • Loading...

More Telugu News