Andhra Pradesh: పొత్తుల విషయంలో చంద్రబాబుపై మంత్రి అనిల్ సెటైర్లు

  • చంద్రబాబు ట్రంప్ తోనైనా పొత్తు పెట్టుకోగలరని ఎద్దేవా
  • జగన్ సింహం లాంటివాడని వ్యాఖ్యలు
  • 2024లో పొత్తు లేకుండా పోటీ చేసే ధైర్యం ఉందా అంటూ సవాల్

విపక్ష నేత చంద్రబాబు ఇవాళ కొత్తగా పొత్తుల గురించి మాట్లాడుతున్నారంటూ మంత్రి అనిల్ కుమార్ ఎద్దేవా చేశారు. పొత్తు లేనిదే ఎన్నికల్లో పోటీ చేయలేరంటూ విమర్శించారు. బీజేపీ, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, జనసేన ఇలా అన్ని పార్టీలు అయిపోయాయంటూ వ్యాఖ్యానించారు. చంద్రబాబు అవసరమైతే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో కూడా పొత్తు పెట్టుకోగలరని వ్యంగ్యం ప్రదర్శించారు.

కానీ, సీఎం జగన్ సింహం లాంటివాడని, ఆయన నాయకత్వంలో వైసీపీ సింగిల్ గానే పోటీ చేస్తుందని, 2024లో కూడా తాము ఒంటరిగానే పోటీకి దిగుతామని అనిల్ పేర్కొన్నారు. వైసీపీ పొత్తుల కోసం చూసే పార్టీ కాదని స్పష్టం చేశారు. 2024లో పొత్తు లేకుండా ఎన్నికల్లో పోటీచేస్తామని చెప్పే ధైర్యం టీడీపీకి ఉందా? అంటూ మంత్రి సవాల్ విసిరారు.

Andhra Pradesh
Telugudesam
YSRCP
Chandrababu
Anil Kumar Poluboina
Jagan
  • Error fetching data: Network response was not ok

More Telugu News