Jagan: ‘అమ్మఒడి’పై ప్రతి ఒక్కరూ సీఎం జగన్ ని అభినందించాలి: టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ

  • ‘అమ్మఒడి’ సంక్షేమ పథకం కాదు ‘మంచి సంస్కరణ’
  • ఎన్నో ప్రభుత్వాలు వచ్చినా పేదపిల్లలను పట్టించుకోలేదు
  • విప్లవాత్మకమైన మార్పు తెచ్చిన జగన్ కు అభినందనలు

‘అమ్మఒడి’ని ఒక సంక్షేమ పథకంగా కాకుండా ఒక ‘మంచి సంస్కరణ’గా భావిస్తున్నానని టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అన్నారు. అసెంబ్లీలో ఇవాళ ఆయన మాట్లాడుతూ, ఇంతవరకూ ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా, ఎంత మంది ముఖ్యమంత్రులు వచ్చినా పేద పిల్లల చదువు గురించి ఆలోచించలేదని, ఆవిధంగా ఆలోచించి ఇంత విప్లవాత్మకమైన మార్పు తెచ్చిన  సీఎం జగన్ అని ప్రశంసించారు. మా పిల్లల్ని ఎక్కడ చదివించుకుందాం, వాడు ఎంత పప్పు అయినా స్టాన్ ఫోర్డ్ లో చదివించుకుందామా, ఇంకోచోట చదివించుకుందామా’ అని ఆలోచించారే తప్ప, పేద పిల్లల గురించి ఆలోచించలేదని విమర్శించారు. ఇటువంటి మంచి కార్యక్రమంపై జరుగుతున్న చర్చలో చంద్రబాబు లేకపోవడాన్ని ఆయన ప్రస్తావించారు. రాజకీయాలకు అతీతంగా ప్రతిఒక్కరూ సీఎం జగన్ ని అభినందించాల్సిన అవసరం ఉందని అన్నారు.

Jagan
YSRCP
Telugudesam
Vallabhaneni Vamsi
  • Loading...

More Telugu News