Rajendra Prasad: నిర్మాతగా నేను పనికిరాననే విషయం అర్థమైంది: సీనియర్ హీరో రాజేంద్రప్రసాద్

  • 'మేడమ్' సినిమాతో నిర్మాతగా మారాను
  • 'రాంబంటు' పెద్దగా ఉపయోగపడలేదు
  • అందుకే ఆ ప్రయత్నాలు మానుకున్నానన్న రాజేంద్రప్రసాద్  

నటుడిగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తనదైన ముద్ర వేసిన రాజేంద్ర ప్రసాద్, నిర్మాతగానూ కొన్ని ప్రయోగాలు చేశారు. అయితే ఆయన నిర్మించిన సినిమాలు నిరాశపరిచాయి. అదే విషయాన్ని గురించి తాజాగా ఆయన 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో ప్రస్తావించారు.

"ప్రతి ఆర్టిస్ట్ కి ఫలానా పాత్ర చేయాలనే ఒక అభిరుచి ఉంటుంది. అలాగే లేడీ గెటప్పులో కనిపించే కథ ఒకటి చేయాలనే ఆసక్తి నాకు ఉండేది. ఈ ప్రయోగాన్ని ఎవరిమీదనో రుద్దడం ఎందుకు? అనిపించింది. అందుకే నా ముచ్చటను తీర్చుకోవడం కోసం 'మేడమ్' సినిమాకి నేనే నిర్మాతగా మారాను. ఆ తరువాత బాపు గారి దర్శకత్వంలో 'రాంబంటు' సినిమాను చేశాను. నిజానికి అది చాలా మంచి సినిమా .. కానీ అది కూడా నాకు పెద్దగా ఉపయోగపడలేదు. దాంతో నేను నిర్మాతగా పనికిరాననే విషయం నాకు అర్థమై ఇక అలాంటి ప్రయత్నాలు చేయలేదు" అని చెప్పుకొచ్చారు.

Rajendra Prasad
Ali
  • Loading...

More Telugu News