Andhra Pradesh: మేం పెద్దన్న పాత్ర పోషిస్తే టీడీపీ దద్దమ్మ పాత్ర పోషిస్తుందా?: జీవీఎల్

  • టీడీపీపై బీజేపీ ఎంపీ ధ్వజం
  • గతంలో కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు ససేమిరా అన్నారని మండిపాటు
  • ఇప్పుడు కేంద్రం సాయం కోరుతున్నారని ఆగ్రహం

బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఏపీ పరిణామాలపై ఘాటుగా స్పందించారు. ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, గతంలో తాము హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేయాలని కోరితే ససేమిరా అన్న చంద్రబాబు ఇవాళ కేంద్రం సాయం కోరుతున్నారని మండిపడ్డారు. ఏపీ రాజధాని అంశంలో కేంద్రం పెద్దన్న పాత్ర పోషించాలని టీడీపీ నేతలు విజ్ఞప్తి చేస్తున్నారని, తాము పెద్దన్న పాత్ర పోషిస్తే టీడీపీ దద్దమ్మ పాత్ర పోషిస్తుందా? అంటూ ఎద్దేవా చేశారు. నాడు శివరామకృష్ణన్ కమిటీ వద్దని మొత్తుకున్నా చంద్రబాబు వినలేదని, రాజధానిని అమరావతిలోనే ఏర్పాటు చేశారని జీవీఎల్ అన్నారు. రాజధాని అంశం రాష్ట్రానికి సంబంధించినది కాబట్టి అప్పుడు ఎవరూ అభ్యంతరం చెప్పలేదని అన్నారు.  

Andhra Pradesh
BJP
Telugudesam
New Delhi
GVL Narasimha Rao
Chandrababu
  • Loading...

More Telugu News