Anil Ravipudi: నాకు నో చెప్పాలనే ఉద్దేశంతోనే విజయశాంతిగారు కథ విన్నారు: దర్శకుడు అనిల్ రావిపూడి

  • విజయశాంతిగారు రాజకీయాల్లో బిజీ 
  • ఆమె సినిమాలు చేసే ఉద్దేశంతో లేరు 
  • కథ పట్టుకుని అదే పనిగా తిరిగానన్న అనిల్ రావిపూడి

అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన 'సరిలేరు నీకెవ్వరు' ఘన విజయాన్ని దక్కించుకుంది. చాలా గ్యాప్ తరువాత విజయశాంతి ఈ సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చారు. ఆమెను ఒప్పించిన తీరును గురించి తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో అనిల్ రావిపూడి ప్రస్తావించాడు.

"విజయశాంతిగారు రాజకీయాల్లో బిజీగా వున్నారు. సినిమాలు చేయాలనే ఆలోచనలో ఆమె లేరు. అలాంటి పరిస్థితుల్లో నేను కథ పట్టుకుని ఆమె ఇంటిచుట్టూ తిరుగుతున్నాను. నేను అలా తిరుగుతుండటం చూసి, 'కథ వినేసి నో చెప్పేస్తే వెళ్లిపోతాడు గదా' అని ఆమె అనుకున్నారు. కథ వింటే చాలు నో చెప్పలేరు అనేది నా నమ్మకం. అనుకున్నట్టుగానే కథ వినేసిన తరువాత ఆమె నో చెప్పలేదు. నా సినిమా ద్వారా ఆమె రీ ఎంట్రీ ఇవ్వడం .. ఆ పాత్రకి మంచి పేరు రావడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది" అని చెప్పాడు.

Anil Ravipudi
Rajendra Prasad
Vijaya Shanthi
  • Loading...

More Telugu News