Galla Jayadev: గల్లా జయదేవ్ కు బెయిల్ ఇచ్చిన మంగళగిరి కోర్టు!

  • నిన్న మధ్యాహ్నం గల్లా అరెస్ట్
  • ప్రస్తుతం గుంటూరు సబ్ జైలులో
  • సాయంత్రానికి విడుదలయ్యే అవకాశం

నిన్న మధ్యాహ్నం అరెస్ట్ అయి, ఈ తెల్లవారుజామున గుంటూరు సబ్ జైలుకు తరలించబడిన తెలుగుదేశం పార్టీ లోక్ సభ సభ్యుడు గల్లా జయదేవ్ కు బెయిల్ మంజూరు అయింది. మంగళగిరి మేజిస్ట్రేట్ కోర్టులో జయదేవ్ తరఫు న్యాయవాది బెయిల్ పిటీషన్ దాఖలు చేయగా, ఆయనకు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేస్తున్నట్టు న్యాయమూర్తి ప్రకటించారు.

మరికాసేపట్లో బెయిల్ పత్రాలు గుంటూరు సబ్ జైలు అధికారులకు అందిస్తామని, ఆపై సాయంత్రంలోగా గల్లా విడుదల అవుతారని ఆయన తరఫు న్యాయవాదలు తెలిపారు. ఏపీ రాజధానిని మూడు ప్రాంతాలకు మార్చడంపై గల్లా జయదేవ్ నిన్న నిరసనలకు దిగగా, ఆయనపై నాన్ బెయిలబుల్ కేసును పోలీసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

Galla Jayadev
Mangalagiri
Court
Bail
  • Loading...

More Telugu News