Tammineni Sitaram: పదేపదే అడ్డుకుంటూ అసభ్య పదజాలం... టీడీపీ సభ్యులపై స్పీకర్ తమ్మినేని తీవ్ర ఆగ్రహం!

  • బిల్లులపై చర్చిస్తున్న వేళ అడ్డుకున్న టీడీపీ ఎమ్మెల్యేలు
  • అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని తమ్మినేని మనస్తాపం
  • చైర్ ను వదిలేసి వెళ్లడంతో తీవ్ర గందరగోళం

నేటి సభలో ఎస్సీ వర్గీకరణ బిల్లుపై చర్చ జరుగుతున్న వేళ, పదేపదే తెలుగుదేశం సభ్యులు అడ్డుకోవడంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన స్పీకర్ తమ్మినేని సీతారాం, సభను అర్ధాంతరంగా వాయిదా వేసి, తన స్థానం నుంచి లేచి వెళ్లిపోయారు. టీడీపీ సభ్యులు చైర్ ను అవమానిస్తున్నారని, ఈ పరిస్థితుల్లో తాను సభను నడిపించలేనని అంతకుముందు ఆయన వ్యాఖ్యానించారు. తనను అసభ్య పదజాలంతో దూషించడం ఏంటని ఆయన ప్రశ్నించారు.

స్పీకర్ చైర్ ను అగౌరవ పరుస్తున్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు సిగ్గు పడాలని అన్నారు. కీలక చట్టాలను చేస్తున్న సమయంలో విపక్షాలకు ఉన్న సంఖ్యాబలంతో పోలిస్తే, తాను అధిక ప్రాధాన్యం ఇస్తున్నానని, అయినా, చైర్ ను అవహేళన చేస్తున్నారని ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సమాజానికి ఆదర్శంగా నిలబడాల్సిన సభలో ఈ పరిస్థితిని తాను ఊహించలేదని అన్నారు. స్పీకర్ చైర్ ను వదిలి వెళ్లడంతో సభలో తీవ్ర గందరగోళ పరిస్థితి ఏర్పడింది.

Tammineni Sitaram
Andhra Pradesh Assembly
Velagapudi
Speaker
  • Loading...

More Telugu News